ప్రింట్ బుక్: వరాహోపనిషత్ (శుక్ల యజుర్వేదాంతర్గత)

In stock
SKU
VU-TE-RSS-016
₹130.00
Publisher & Author
శుక్ల యజుర్వేదమునకు చెందిన ఈ వరాహోపనిషత్ 13-16 శతాబ్దములలో రచింపబడినట్లు పండితుల అభిప్రాయంగా ఉన్నప్పటికీ, దీనిలో అనేక ప్రాచీనమైన భావములు కనిపిస్తున్నాయి. దీనిలో 5 అధ్యాయములు, 247 శ్లోకములున్నాయి. బ్రహ్మమానస పుత్రుడైన బుభుమహర్షి తపస్సు గురుంచి, ఆయన పొందిన జ్ఞానమును గురించి, పులస్త్యబ్రహ్మ కుమారుడైన నిదాఘునికి ఆయన గురువై జ్ఞానభోద చేసిన వృత్తాంతమంతా ఈ ఉపనిషత్తులో ఉన్నది గనుక ఇది అతి ప్రాచీనమైనదే గాని తరువాతి కాలంలో గ్రంథస్థం చేయబడినదని అర్ధమౌతున్నది.
మొదటి మూడు అధ్యాయములలో బుభుమహాముని తపోవృత్తాంతము, ఆయనకు వరాహస్వామి చేసిన జ్ఞానబోధ కనిపిస్తాయి. నాలుగు అయిదు అధ్యాయములలో బుభుమహాముని తన శిష్యుడైన నిదాఘునకు చేసిన బోధ గోచరిస్తుంది. అయిదవ అధ్యాయం పూర్తిగా యోగపరమైన విషయములతో నిండి యున్నది. దీనిలో మంత్ర, లయ, హఠయోగములు చెప్పబడినాయి.
తత్త్వ సిద్దాంతమును, అద్వైత వేదాంతమును, బ్రహ్మవిద్యను, ఆత్మజ్ఞానమును, జీవన్ముక్తలక్షణములను, జ్ఞానభూమికలను, యోగశాస్త్రమును ఒక్క చోటకు తేవాలన్న ప్రయత్నం ఈ గ్రంథంలో కనిపిస్తున్నది.
'పంచవటి' నుండి మరొక్క మహత్తరమైన వేదాంత-యోగ గ్రంథమును నా వ్యాఖ్యానముతో వెలువరుస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము. మా తక్కిన గ్రంథముల వలెనే ఇది కూడా ముముక్షులవులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మా విశ్వాసం.

More Information
పుస్తకం టైప్ ప్రింట్ బుక్
పుటలు 144
రచయిత రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ
Write Your Own Review
You're reviewing:ప్రింట్ బుక్: వరాహోపనిషత్ (శుక్ల యజుర్వేదాంతర్గత)