Call +91 970 390 33 99

Select Preferred Currency here »

Sale

మహా యజ్ఞం (నవల) / maha yagnam

Be the first to review this product

మహా యజ్ఞం (నవల) - maha yagnam

Publishers : Pustakam.org

Availability: In stock

Regular Price: $1.40

Now only: $1.12

* Required Fields

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

ఈ ప్రపంచానికి కొత్తగా చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. సత్యం, అహింస అన్నవి పర్వతాలంత ప్రాచీనమైనవి - మహాత్మ గాంధీ.
# # #

ఎట్టి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని మాత్రమే చెప్పడం నిజాయితీ. అవసరాన్ని బట్టి అసత్యమాడడం మోసం. కొన్ని ప్రయోజనాలకోసం సత్యాన్ని దాచడం లౌక్యం. అయితే స్వలాభం కోసం అసత్యాన్ని సత్యంగానూ, సత్యాన్ని అసత్యంగానూ ప్రచారం చెయ్యడమే రాజకీయం!

మనల్ని దెబ్బతీసిన వాడిని కూడా క్షమించి వదిలేయడం అహింస. మనల్ని దెబ్బతీసిన వాడిమీద అంతకంతా ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం హింస. మనల్ని దెబ్బ తీస్తాడనుకున్న శతృవు ఎత్తుగడని ముందుగానే ఊహించి, అంతకన్నా ముందుగానే వెనుకనుంచి అతడ్ని దొంగదెబ్బ కొట్టడమే రాజకీయం !

# # #

అతడొక సాధారణ జర్నలిస్టు. ఎదుటి వ్యక్తి కాకలు తీరిన రాజకీయ నాయకుడు! ఇద్దరూ ఢీకొన్నారు.

‘అధికారాన్ని కాపాడుకోవడానికి నానా గడ్డీ కరవడం మాత్రమే కాదు- రాజకీయం అంటే’ అన్నాడతడు.

‘మాకింతకన్నా మరో మార్గం తెలియదు. ఒడ్డున నిలబడి కబుర్లు చెప్పడం కాదు. దమ్ముంటే రాజకీయాల్లోకి రా. నిజాయితీగా ఒక్కసారి ఎన్నికల్లో నెగ్గి చూపించు’ అన్నాడా రాజకీయనాయకుడు.

అతడు కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆలోచించాడు. నీతికి కట్టుబడి ఉంటూ రాజకీయాల్లో పైకి రావడం అంత కష్టమా? నిజాయితీగా ప్రజలకి సేవచేస్తూ పదవి నిలబెట్టుకోవడం అంత కష్టమా? కళ్ళు తెరిచి, ‘నేను సిద్దం’ అన్నాడు.

‘పందెమా చెప్పు? గెలిస్తే ఏం కావాలి నీకు? నా ఆస్థి మొత్తం రాసివ్వమంటావా? నా కూతుర్నిచ్చి పెళ్ళి చెయ్యమంటావా?’ వ్యంగ్యంగా అన్నాడా రాజకీయనాయకుడు.

‘ఇప్పుడేమీ చెప్పను. గెలిచాక అడుగుతాను నాకేం కావాలో’ అన్నాడా యువకుడు. అతడి పేరు సత్యం…

యజ్ఞం మొదలైంది. అతడెలా గెలిచాడు? గెలిచాక అతడు కోరిన కోరిక ఏమిటి?!

అక్షరాల వెంట పరుగులు పెట్టించే నవల…

ఆకునూరి మురళీకృష్ణ - మహాయజ్ఞం

Additional Info

Additional Info

Book Type eBook for Sale
Publisher Pustakam.org
Author Akunuri Murali Krishna
Number of Pages 164
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: మహా యజ్ఞం (నవల) / maha yagnam

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.