Call +91 970 390 33 99

Select Preferred Currency here »

రాణీ పులోమజాదేవి కథలు / Rani Pulomajadevi kathalu

Be the first to review this product

పులోమజ కథ చదువుతూంటే బుజ్జిగాడికి గోరుముద్దలు తినిపిస్తూ అమ్మ చెప్పే కథలా, క్లిష్టమైన పాటని కూడా అరటిపండు ఒలిచి తినిపించినట్టు నేర్పించే పెండ్యాల వారి బాణీలా అలతి మాటల్లో అనంతాన్ని చూపే ఆత్రేయ గీతంలా ఉంటుంది. ఉత్ప్రేక్ష కాదు. నాకు ఆప్తులైన వారి సాంగత్యానుభవం, మళ్ళీ అనుభవించినంత ఆనందం కలిగి ఆ ఉపమానాలు వాడా! అమ్మల కథలు, నాన్నల కథలు, తమ్ముళ్ళ, అక్కల, చెళ్ళెళ్ళ కథలు, జేజెమ్మల కథలు, స్నేహితురాళ్ళ కథలూ, అన్నీ సంసారపక్షమైనవే.

Publishers : Pustakam.org

Availability: In stock

$1.86

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

పులోమజ కథ చదువుతూంటే బుజ్జిగాడికి గోరుముద్దలు తినిపిస్తూ అమ్మ చెప్పే కథలా, క్లిష్టమైన పాటని కూడా అరటిపండు ఒలిచి తినిపించినట్టు నేర్పించే పెండ్యాల వారి బాణీలా అలతి మాటల్లో అనంతాన్ని చూపే ఆత్రేయ గీతంలా ఉంటుంది. ఉత్ప్రేక్ష కాదు. నాకు ఆప్తులైన వారి సాంగత్యానుభవం, మళ్ళీ అనుభవించినంత ఆనందం కలిగి ఆ ఉపమానాలు వాడా! అమ్మల కథలు, నాన్నల కథలు, తమ్ముళ్ళ, అక్కల, చెళ్ళెళ్ళ కథలు, జేజెమ్మల కథలు, స్నేహితురాళ్ళ కథలూ, అన్నీ సంసారపక్షమైనవే.

ప్రతీ కథలో 'మనకు తెలిసినవాళ్ళూ', ఒక్కోసారి 'మనమూ' తారసపడతాం. రచయిత్రి, కథకు సంబంధించిన, కథాపాత్రలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపించింది. పరిష్కారం లేని సమస్యల పరిష్కారాలను పాఠకులకే ఒదిలేసింది తప్ప, అతితెలివి పరిష్కారాలూ, అధిక ప్రసంగాలూ చేయలేదు.

భాషా పరంగా, తన ప్రతిభను చూపడం కోసం అనవసరమైన శబ్ద ప్రయోగాలు చేయలేదు. సంభాషణం, భాషా, సాదాసీదాగా అవసరమైనంతవరకే ఉపయోగింపబడింది.

ఈ కథా సంకలనం కాలక్షేపం బఠానీ కాదు - కాలానుగుణంగా ఎన్నో మార్పులు మానవ జీవితాల్లో చోటు చేసుకున్నా, మౌలిక బంధాలకు ప్రాముఖ్యతనిస్తూ, ఛాదస్తాలకు అతీతంగా, సాధారణ సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచింపజేసే, "అవునా? మనమూ ఇంతేనా?" అనే ప్రశ్నలను మనకు మనం వేసుకుని, క్లిష్టమైన సమస్యలను వీలైనంత సరళ సమీకరణంగా మార్చుకునే ప్రయత్నం చేయించే ప్రయత్నం.

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

నూరేళ్ళ పండగని పూర్తి చేసుకున్న తెలుగు కథానిక - రాసిలో, వాసిలో గడ్డకెక్కింది. దండిగా పేరు ప్రతిష్టల్ని గడించింది. ఎంతో ఎత్తుకు ఎదిగింది అటు సామాజిక సంక్షోభాన్ని, ఇటు 'మనిషి' అంతరంగ చిత్రాల్నీ ఆవిష్కరిస్తూ, ఆకాశమే హద్దుగా రూపొందింది. రాణీ పులోమజాదేవిగారి కథానికల్లోనూ - సమాజం వర్సెస్ మనిషి సంఘర్షణలూ, సంక్లిష్ట సమస్యలూ చోటు చేసుకున్నాయి. అయితే వస్తు వైచిత్రి మీద దృష్టి పెట్టినా, ఆమె కథానికల్లో - పూసల్లో దారంలా - మనిషి మనస్తత్వ విశ్లేషణా, మానవ సంబంధాల్లోని వైరుధ్యాలు తొంగి చూస్తున్నాయి. చాలా కథల్లో రాణీపులోమజాదేవి గారి సమాజ కల్యాణాకాంక్ష, స్త్రీ చైతన్యాభిలాష, మనిషి మంచితనం పట్ల విశ్వాసం ప్రస్ఫుటమవుతున్నాయి. అధ్యయనశీలిగా, రచనానుభవశాలిగా రాణీపులోమజాదేవిగారు కథానికారచన మీద అన్‌డివైడెడ్ అటెన్షన్ పెట్టాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

విహారి

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Pustakam.org
Author Ranipulomajaadevi
Number of Pages 213
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: రాణీ పులోమజాదేవి కథలు / Rani Pulomajadevi kathalu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Quality
Price
Value

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.