Call +91 970 390 33 99

Select Preferred Currency here »

పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు / Pothuri Vijayalakshmi Hasya Kathalu

Be the first to review this product

శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి రచించిన హాస్యకథల సంపుటం ఇది. 24 కథలున్న ఈ సంపుటిలో ప్రతీ కథా హాయిగా నవ్విస్తుంది. చతురమైన సంభాషణలతో, అమాయకత్వంతో కూడిన సునిశిత హాస్యం అన్ని కథలలోనూ ఉంది. మచ్చుకి ఓ కథలోని సరదా ఘట్టం.

Publishers : Sri Rishika Publications

Availability: In stock

$1.92
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి రచించిన హాస్యకథల సంపుటం ఇది. 24 కథలున్న ఈ సంపుటిలో ప్రతీ కథా హాయిగా నవ్విస్తుంది. చతురమైన సంభాషణలతో, అమాయకత్వంతో కూడిన సునిశిత హాస్యం అన్ని కథలలోనూ ఉంది. మచ్చుకి ఓ కథలోని సరదా ఘట్టం...

పిల్లలకీ మేస్టార్లకీ మా అమ్మమ్మ నెత్తిమీద దేవత. వాళ్ళు గౌరవిస్తున్న కొద్దీ చనువు ఎక్కువయింది. అన్నిటా తలదూర్చడం ప్రారంభించింది.

ఒకరోజు దక్షిణం వైపు కూర్చుని అరటి దూట తరుక్కుంటోంది. పక్కన స్కూల్లో సోషల్‌మాస్టారు రామతారకంగారు పాఠం చెబుతున్నారు.

"మనదేశమును ఎందరో రాజులు పాలించిరి. అశోకుడు పాలిచ్చెను, హర్షవర్ధనుడు పాలిచ్చెను, చించిసారుడు పాలిచ్చెను" అంటూ దీక్షగా చెప్పుకుపోతుంటే అమ్మమ్మ "రామతారకంగారూ, ఇట్రండి. ఇందాకటి నుంచి వింటున్నాను. ఆ రాజు పాలిచ్చాడు, ఈ రాజు పాలిచ్చాడు అంటున్నారు. పాలివ్వడానికి వారేమయినా పాడిపశువులా?" అని అడిగింది.

ఆయన తడబడిపోయి, "అదికాదండీ పెద్దమ్మగారూ, పరిపాలించారు అని చెప్తున్నా" అన్నాడు.

"బాగానే ఉంది. మీరు వినలేదేమో! మొన్న దేవుడి గుళ్ళో వరికూటి జయమ్మగారు హరికథ చెబుతూ ఫలానా చక్రవర్తి ఫలాని నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలినారు అని ఎంత స్పష్టంగా చెప్పిందో! మీరూ అలాగే చెప్పొచ్చుగా. పాలిచ్చారు, పెరుగిచ్చారు అని సొంత కవిత్వం ఎందుకూ?" అంది. మేస్టారి మొహం చిన్నబోయింది.

పిల్లలంతా కిసుక్కున నవ్వేరు.

మేస్టారు ఏమీ చేయలేక బెత్తం తీసుకుని 'సైలెన్స్ సైలెన్స్' అని బల్ల మీద బాదేశారు.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Sri Rishika Publications
Author Poththuri Vijayalakshmi
Number of Pages 152
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు / Pothuri Vijayalakshmi Hasya Kathalu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.