Call +91 970 390 33 99

Select Preferred Currency here »

ద్రోహవృక్షం / Drohavruksham

Be the first to review this product

"బైబిలు, న్యూ టెస్ట్‌మెంటు, జీసస్ క్రైస్టు గురించి వినే ఉంటావు. క్త్రెస్టుని శిలువ వేయడానికి పట్టి ఇచ్చిన శిష్యుడి పేరు జూడా. క్రైస్టుని పట్టి ఇచ్చినాక పశ్చాత్తాపపడి 'పవిత్ర రక్తాన్ని మోసం చేసిన పాపిని' అంటూ ఆవేదనపడి, ఊరి బయటనున్న ఒంటరి చెట్టుకు ఉరి వేసుకున్నాడు

Publisher : Nil

Availability: In stock

$1.55

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

"బైబిలు, న్యూ టెస్ట్‌మెంటు, జీసస్ క్రైస్టు గురించి వినే ఉంటావు. క్త్రెస్టుని శిలువ వేయడానికి పట్టి ఇచ్చిన శిష్యుడి పేరు జూడా. క్రైస్టుని పట్టి ఇచ్చినాక పశ్చాత్తాపపడి 'పవిత్ర రక్తాన్ని మోసం చేసిన పాపిని' అంటూ ఆవేదనపడి, ఊరి బయటనున్న ఒంటరి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మరుసటి రోజు చెట్టు మొత్తం వెలిగిపోయి, దాని కొమ్మల నిండా ఎర్రటి పూలు (జూడా చెట్టు ఎర్రగా వెలిగిపోతుంటుంది) పూశాయి. ఆ చెట్టే ఇది" అని క్షణం సేపు ఆగి, "ఈ రంగు పూలను చూసి మోసపోకు. దీని అందాలను చూసి మోహపడకు. ఇది నమ్మకద్రోహం నుంచి పుట్టిన అందం" అని "నా జుట్టు చూశావా? ఎర్రటి రంగులో మిలమిలలాడుతూ, బహుశా జూడా రక్తం నాలోనూ పారుతోందేమో?" అని, మళ్ళీ కొద్దిక్షణాలు ఆగి, "నా పేరు ఉ. కొండయ్య. మనిద్దరం ముప్ఫయేళ్ళ క్రితం ఈ ప్రాంతాల్లోనే తిరిగాము. బహుశా నీకు గుర్తు ఉండి ఉండదు. సిటీ మనిషి వయ్యావు. అయ్యేయస్ పరీక్షేదో రాసినట్టున్నావు. మనం మళ్ళీ ఇట్లా, జూడాస్ చెట్టు దగ్గర కలుసుకోడం కాకతాళీయం మాత్రం కాదు."

"మైకులో ప్రకటన విన్నావు కదా, ఒక సభ కాదు. రెండు సభలు జరగబోతున్నాయి. బహుశా కొట్లాటలు కూడా జరగవచ్చు. బహుశా ఎర్రటి జూడా పూలరంగు రక్తాలు కూడా పారవచ్చు. ఇక అడవంతా ఎర్రపూల సౌందర్యమే. నీ కుంచె పట్టనంత..."

"ఉ.కొండయ్యను. గుర్తుకొచ్చానా?" అంటూ గంభీరంగా అడుగు వేసుకుంటూ ఊరువైపుకు నడిచాడు అతను.

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Nil
Author V. Chandrasekhar Rao
Number of Pages 250
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: ద్రోహవృక్షం / Drohavruksham

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Value
Quality
Price

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.