Call +91 970 390 33 99

Select Preferred Currency here »

అవతలి వైపు / avatalivaipu

Be the first to review this product

స్వాతీ శ్రీపాదది బహుముఖీనమైన కృషి. ఆ కృషిలో లోతైన చైతన్య స్రవంతి. ఆమె Indo-Anglian కవిత్వం, నవలారచన, కథానికా సాహిత్య మర్మాల మథనం- ముఖ్య మాధ్యమాలు.

సృజనాత్మక పథంలో కథానికనూ, అనుసృజనాత్మక పట్టికలో అనువాదాన్ని- ఆమె ఎంచుకోవచ్చని నా ఊహ. ఏది ఏమైనా ఆమె ఇప్పుడు గొప్ప (తరగని) సృజనాత్మక నేపథ్యంలో నిలిచివుంది. ఆ నేపథ్యం కొంత లౌకిక దృష్టి, దాని వెన్నంటే కొంత తాత్త్విక పరిశీలనాదృష్టి. ఇక్కడ- ఒక అంతర్యుద్ధం అనివార్యం.

Publishers : Pustakam.org

Availability: In stock

$1.60
Click here to see price in Indian Rupees.

Now we are shipping International

Call Pustakam.org support team on +91 9703903399 for any inquiries on this Book




    • Now you can select your favorite currency, either USD or INR.
      Please select "Telugu" Language for shopping in INR, or select "English USA" language for shopping in USD.

Description

Details

స్వాతీ శ్రీపాదది బహుముఖీనమైన కృషి. ఆ కృషిలో లోతైన చైతన్య స్రవంతి. ఆమె Indo-Anglian కవిత్వం, నవలారచన, కథానికా సాహిత్య మర్మాల మథనం- ముఖ్య మాధ్యమాలు. సృజనాత్మక పథంలో కథానికనూ, అనుసృజనాత్మక పట్టికలో అనువాదాన్ని- ఆమె ఎంచుకోవచ్చని నా ఊహ. ఏది ఏమైనా ఆమె ఇప్పుడు గొప్ప (తరగని) సృజనాత్మక నేపథ్యంలో నిలిచివుంది. ఆ నేపథ్యం కొంత లౌకిక దృష్టి, దాని వెన్నంటే కొంత తాత్త్విక పరిశీలనాదృష్టి. ఇక్కడ- ఒక అంతర్యుద్ధం అనివార్యం. ఆ అనివార్యతను రచయిత యొక్క సాంఫిుక సాంస్కృతిక సామాజిక నేపథ్యం నిర్ణయిస్తుంది. ఆ నేపథ్యం- మధ్యతరగతి సంక్లిష్ట మనస్తత్వం అస్తిత్వమా- వాళ్లది అభద్రతా భావ డోలిక. ఆదర్శమా- మహోన్నత మానవతా దర్పణం. కొంచెం మెట్ట వేదాంతం. ఎక్కువ భాగం పరంపర. అందులోనే ఇరుకు బాటలు, అందులోనే ఆకాశం అంత ఎత్తుగల విశాల స్వప్నాలు. ఈ civil war చాలా కథల్లో గోచరమవుతుంది. ఆమె శైలీ ప్రవాహ వేగంతో పఠితను ఆ బలమైన గాలి- ముందుకు తోస్తూనే వుంటుంది. అరిషడ్వర్గాలు, పశ్చాత్తాపాలు, అంతర్మథనాలు, క్షణికావేశాలూ, శాశ్వత ముద్రలూ- మానవుడి సవాలక్ష మానసిక చలనాలు అనిశ్చితాలూ- అన్నిటి మధ్యా పరస్పర సంయమనంతో కూడిన సంఘర్షణలు- సభ్యతా లోక Rules ప్రకారమే తటస్థిస్తాయి. అది శ్రీపాద స్వాతి రచనా యోచనా సామర్థ్యానికి గీటురాయి. వేలాది తిట్లు, తిమ్ములు, ఈసడింపులు, హేళనలకు- ప్రతిసారీ- గురి అవుతున్న మధ్యతరగతి జీవన ధర్మాన్ని కేతనంగా ఎత్తిన ఈ కథారచయిత్రి స్వాతి శ్రీపాదకు ముందెంతో ఆశావహ భవిష్యత్తు వుంది. ఎక్కడ? ఆంధ్ర సారస్వతలోకంలో, నా మాట ఎన్నడూ వమ్ము కాలేదు. శుభమ్‌. - మునిపల్లె రాజు

Additional Info

Additional Info

Book Type Print Book
Publisher Pustakam.org
Author Sripada Swathi
Number of Pages 188
Translator(s) No

Reviews

Write Your Own Review

You're reviewing: అవతలి వైపు / avatalivaipu

How do you rate this product? *

  1 star 2 stars 3 stars 4 stars 5 stars
Price
Value
Quality

Tags

Tags

Other people marked this product with these tags:

Use spaces to separate tags. Use single quotes (') for phrases.